ఇటీవ‌ల ఏపీలోని చిత్తూరు జిల్లాలో భారీ వ‌ర్షాలు కురిసి తిరుప‌తిని నీటిలో ముంచిన విష‌యం విధిత‌మే. అయితే భారీ వ‌ర్షాల కార‌ణంగా ఆ ప్రాంత వాసులు ప‌లు ఇబ్బందులు ఎదుర్కున్న సంగ‌తి తెలిసిన‌దే. అయితే తిరుప‌తిలోని శ్రీ‌కృష్ణ‌న‌గ‌ర్‌లో ప్ర‌జ‌లు రెండు రోజుల నుంచి భ‌యం గుప్పిట్లో గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నారు. మొన్న‌ ఓ మ‌హిళా ఇంట్లోని వాట‌ర్ ట్యాంకును శుభ్రం చేస్తుండ‌గా ఒక్క‌సారిగా భూమి లోప‌లి నుంచి పైకి వచ్చి భ‌య‌బ్రాంతుల‌కు గురి చేసింది.

అయితే ఈ ఘ‌ట‌న త‌రువాత అక్క‌డి ప్ర‌జ‌లు కంటిమీద కునుకు లేకుండా గ‌డుపుతున్నారు. ఇదే త‌రుణంలోనే  తాజాగా శ్రీ‌కృష్ణ‌న‌గ‌ర్‌లో మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. వాట‌ర్ ట్యాంకు ఘ‌ట‌న జ‌రిగిన ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉన్న దాదాపు 18 ఇండ్ల‌కు పైగా అక‌స్మాత్తుగా బీట‌లు వారాయి. గోడ‌లు, మెట్ల‌పై భారీగా ప‌గుళ్లు ఏర్ప‌డినాయి. కృష్ణాన‌గ‌ర్‌లో నివ‌సించాలంటేనే భ‌యంగా ఉంద‌ని, ఎక్క‌డ నుంచి ప్ర‌మాదం పొంచి ఉందోన‌ని తెలియ‌క భ‌య‌ప‌డుతున్నారు ప్ర‌జ‌లు. ముఖ్యంగా రాయ‌ల‌సీమ‌లో ఇలాంటి ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం ఇదే ప్ర‌థ‌మ‌మ‌ని ప్రొఫెస‌ర్ బృందం తెలియ‌జేసిన‌ది.


మరింత సమాచారం తెలుసుకోండి: