ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి రాజ‌ధానిగా అమ‌రావ‌తి ఉండాల‌ని ప్ర‌జ‌లంద‌రూ ఆకాంక్షిస్తున్నారు అని మాజీమంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు పేర్కొన్నారు. అందుకోస‌మే అంద‌రి మ‌ద్ద‌తుతో మ‌హాపాద‌యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కొన‌సాగుతుంద‌ని వెల్ల‌డించారు. మ‌హాపాద‌యాత్ర‌కు రాళ్లు వేస్తార‌ని ప్ర‌భుత్వం పేర్కొన్న‌ద‌ని.. కానీ ప్ర‌జ‌లు పూల వ‌ర్షం కురిపిస్తున్నార‌ని దేవినేని తెలిపారు.

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం 250 మంది బ‌లిదానం అయ్యార‌ని.. రాజ‌ధాని విష‌యంలో ప్ర‌భుత్వం దుర్మార్గంగా మాట్లాడ‌డం స‌రికాద‌ని దేవినేని ఉమా చెప్పారు.  అస‌మ‌ర్థ సీఎం జ‌గ‌న్ అని.. ఇప్ప‌టికే ఏపీనీ అప్పుల్లోకి నెట్టార‌ని పేర్కొన్నారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఏకైక  రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న 'మహాపాదయాత్రస శ‌నివారానికి 27వ రోజుకు చేరుకుంది.  

న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన యాత్ర ఇవాళ నెల్లూరు నుంచి ప్రారంభమైన‌ది. శ్రీ  వెంకటేశ్వర స్వామి రథంలో శ‌నివారం రైతులు ప్రత్యేక పూజలు చేసి యాత్రను ఆరంభం చేశారు. నెల్లూరు బారాష‌హీద్ ద‌ర్గా వ‌ద్ద మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసారు. త‌రువాత 12 కిలోమీట‌ర్ల పాటు కొన‌సాగి రాత్రి అంబాపురం వ‌ద్ద యాత్ర యుగియ‌నుంది. దాదాపు 45 రోజుల పాటు కొన‌సాగే యాత్ర ప్ర‌కాశం, గుంటూరు, చిత్తూరు జిల్లాలలోని 70 ప్ర‌ధాన గ్రామాల మీదుగా డిసెంబ‌ర్ 15న తిరుమ‌ల‌కు చేరనున్నది.



మరింత సమాచారం తెలుసుకోండి: