కరీంనగర్‌ మాజీ మేయర్‌, ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్‌సింగ్‌పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేసారు. స్థానిక సంస్థల కోటాలో  జ‌ర‌గ‌నున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో  స్వ‌తంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు రవీంద్ర సింగ్. అయితే ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆయనపై కరీంనగర్‌ గ్రామీణ ఎంపీడీవో ఫిర్యాదు చేసారు. రవీందర్‌ సింగ్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా కరీంనగర్‌లో బరిలోకి దిగి.. మీడియా సమావేశంలో ఓటర్లు రూ.10 లక్షలు డిమాండ్‌ చేసి తీసుకున్నా.. ఓటు మాత్రం తనకే వేయాలని రవీందర్‌ సింగ్‌ వ్యాఖ్యానించార‌ని ప‌లువురు  ఎంపీడీవోకు ఫిర్యాదులు చేసారు.  ఈ త‌రుణంలోనే ఎంపీడీవో ఫిర్యాదు మేరకు రవీందర్‌సింగ్‌పై  కేసు నమోదు చేసారు పోలీసులు.

టీఆర్ఎస్‌లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హరించిన ర‌వీంద్ర‌సింగ్ కరీంన‌గ‌ర్ మేయ‌ర్‌గా బాధ్య‌త‌లు కూడా చేప‌ట్టారు. ఎమ్మెల్సీ ప‌ద‌వీని ఆశించార‌ని, పార్టీ నుంచి అనుమ‌తి రాక‌పోవ‌డంతో స్వ‌తంత్రంగా నామినేష‌న్ వేసారు. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ త‌రుపున టీఆర్ఎస్ ఎల్‌.ర‌మ‌ణ‌, భానుప్ర‌సాద్‌రావుల‌ను బ‌రిలో ఉంచింది. ఇటీవ‌ల టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి.. ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా ర‌వీంద‌ర్‌సింగ్ నామినేష‌న్ దాఖ‌లు చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: