పార్ల‌మెంట్ లో విప‌క్ష నేత‌ల‌తో స‌మావేశాలు జ‌రుగ‌నున్నాయి. ఇవాళ కీల‌క బిల్లుల‌ను స‌భ ముందుకు తీసుకురానున్నారు. ఇవి చాలా ముఖ్య‌మైన స‌మావేశాల‌ని ప్ర‌ధాని మోడీ వెల్ల‌డించారు. ఇవాళ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ జ‌ర‌గాల్సిన అవ‌స‌రముంద‌ని పేర్కొన్నారు. ఉభ‌య స‌భ‌ల్లో సాగు చ‌ట్టాలు, రైతు స‌మ‌స్య‌ల‌పై కాంగ్రెస్ లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల‌లో వాయిదా తీర్మాణాలు. రాజ్య‌స‌భ‌లో టీఆర్ఎస్ వాయిదా తీర్మానం.అదేవిధంగా విప‌క్ష స‌మావేశానికి ఆప్ డుమ్మా కొట్టిన‌ది.
 
ఇవాళ ఉభ‌య స‌భ‌ల ముందుకు సాగు చ‌ట్టాల ర‌ద్దు బిల్లును కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ది. అయితే ఇవి చాలా ముఖ్య‌మైన‌వి పేర్కొన్నారు మోడీ. ఇప్ప‌టికే లోక్‌స‌భ‌లో నోటీ ఇచ్చిన మ‌నోజ్ తివారీ, మాణిక్యం ఠాగూర్ తీర్మానం ఇచ్చారు. తెలంగాణ నుంచి  రాజ్య‌స‌భ‌ ఎంపీ కేశ‌వ‌రావు వాయిదా తీర్మానం ఇచ్చారు.  ధాన్యం సేక‌ర‌ణ‌లో కేంద్ర వివ‌క్ష‌పై టీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఉభ‌య స‌భ‌ల్లోనే విప‌క్షాల నేత‌లు  వాయిదా తీర్మానాలు చేసారు. రాజ్య‌స‌భ‌లో సీపీఐ  ధాన్యసేక‌ర‌ణ‌పై వాయిదా తీర్మానం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: