తెలంగాణ‌లో జ‌నాలు పిట్ట‌ల్లా రాలిప‌డుతున్నారు దొరగారు.. జ‌ర ప‌ట్టించుకోర‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై వైఎస్ ష‌ర్మిల మ‌రొక‌సారి మండిప‌డ్డారు. క‌రోనా సెకండ్ వేవ్‌లో డాక్ట‌ర్లు ఉంటే బెడ్‌లు లేవ‌ని, బెడ్స్ ఉంటే ఆక్సిజ‌న్ లేద‌ని షర్మిల  ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. పారాసిట‌మోల్ వేసుకుంటే స‌రిపోతుంద‌ని.. ప్ర‌జ‌ల ప్రాణాల‌ను గాలికొదిలేసార‌ని, కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు ష‌ర్మిల‌.

ఓ వైపు నిరుద్యోగులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని దొర‌గారు క‌నీసం ఇప్పుడైనా చేతులు కాలినంక ఆకులు ప‌ట్టుకోకుండా ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడాల‌ని,  ముంద‌స్తుగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు ష‌ర్మిల‌. క‌రోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాము అని చేతులు దులుపుకోకుండా క‌రోనా వైద్యం ఉచితంగా అందేవిధంగా చూడాల‌ని కోరారు. కార్పొరేట్ ఆస్ప‌త్రుల‌ను దోపిడీని అరిక‌ట్టాల‌ని, అదేవిధంగా ప్ర‌తీ ఒక్క‌రికీ రెండు డోసులు వ్యాక్సిన్ అందేవిధంగా ప్ర‌భుత్వం అందుకు త‌గ్గ చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. క‌రోనాతో గ‌తంలో ఇల్లు గుల్ల అయిన కుటుంబాల‌కు క‌రోనా వైద్య బిల్లుల‌ను చెల్లించాల‌ని డిమాండ్ చేసారు ష‌ర్మిల‌.


మరింత సమాచారం తెలుసుకోండి: