ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్‌, విప‌క్షాల ర‌గ‌డ, గంద‌ర‌గోళాల‌ మ‌ధ్య లోక్‌స‌భ‌లో ఎట్ట‌కేల‌కు రైతు సాగు చ‌ట్టాల ర‌ద్దు బిల్లుకు తాజాగా ఆమోదం ల‌భించింది. రైతుల‌కు సంబంధించిన బిల్లు కావ‌డంతో ప్ర‌తిపక్షాలు తొలుత డిమాండ్ చేసాయి. అయితే విప‌క్షాల డిమాండ్‌ల మ‌ధ్య‌నే బిల్లుకు లోక్‌స‌భ‌లో ఆమోదం ద‌క్కిన‌ది.

2020 సెప్టెంబ‌ర్‌లో కేంద్ర ప్ర‌భుత్వం  తీసుకొచ్చిన రైతు చ‌ట్టాల‌కు సంబందించిన బిల్లును రైతులు 2020 నవంబ‌ర్‌లోనే వ్య‌తిరేకించారు. దాదాపు ఏడాది కాలం నుంచి ట్రాక్ట‌ర్ల‌తో ర్యాలీలు, నిర‌స‌న‌లు, ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణంతో పోరాటాలు చేసారు. అయితే ఎట్ట‌కేల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఇటీవ‌ల గురునాన‌క్ జ‌యంతి సంద‌ర్భంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసిన‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం విధిత‌మే. ఇవాళ పార్లమెంట్‌లో ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. మ‌రోవైపు రాజ్యసభలో కూడా  ఈ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ విప‌క్షాల మ‌ధ్య కొద్ది సేపు వాయిదా ప‌డిన‌ది. అయితే రాజ్య‌స‌భ‌లో ఈ బిల్లు ఇవాళ ఆమోదం పొందుతుందో లేదో  కొద్ది సేపటి త‌రువాత తెలియ‌నున్న‌ది.



మరింత సమాచారం తెలుసుకోండి: