తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టించిన‌ది. 42 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలుకు  క‌రోనా పాజిటివ్ అని నిర్థార‌ణ అయింది. మొత్తం ఆ గురుకుల పాఠ‌శాల‌లో 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. అయితే ఆదివారం 261 మంది విద్యార్థుల‌కు, 27 మంది సిబ్బందికి కరోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేప‌ట్టారు.

అందులో 42 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలుకు ఈ వైర‌స్ నిర్థార‌ణైంది. అయితే పాజిటివ్ వ‌చ్చిన వారి న‌మూనాల‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. మిగ‌తా విద్యార్థుల‌కు  ఇవాళ క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్నారు. వైర‌స్ సోకిన వారిని వ‌స‌తిగృహంలో క్వారంటైన్ లో ఉంచి వైద్య సేవ‌ల‌ను అందించుతున్నారు. అయితే విద్యార్థుల ఆరోగ్యం మాత్రం నిల‌క‌డ‌గానే ఉన్న‌ద‌ని ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. ఇటీవ‌ల ఖ‌మ్మం జిల్లా వైరాలో తెలంగాణ  గురుకుల పాఠ‌శాల‌, క‌ళాశాల‌లో దాదాపు 27 మంది విద్యార్థుల‌కు క‌రోనా సోకిన‌ది. ఈ విష‌యం ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్లి గురుకుల ప్రిన్సిప‌ల్ మిగ‌తా విద్యార్థుల‌ను కొద్ది రోజుల పాటు ఇండ్ల వ‌ద్ద‌కు పంపించారు. కానీ సంగారెడ్డి జిల్లాలో ఇంకా అలాంటి నిర్ణ‌యం ఏమి తీసుకోలేదని ఉపాధ్యాయులు వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: