ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో  యంగ్‌టైగ‌ర్‌ ఎన్టీఆర్,  మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న విష‌యం విధిత‌మే. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలలో న‌టిస్తూ ఉన్నారు. వీరికి తోడు ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ న‌టిస్తున్నారు.

 ఇటీవలే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలచేస్తున్నామని మూవీమేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన నాటు నాటు సాంగ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌న్న‌న‌లు పొందిన విష‌యం విధిత‌మే. ఈ మ‌ధ్య‌నే విడుద‌లైన జ‌న‌ని గీతం కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గానే మారిన‌ది. భారీ బ‌డ్జెట్ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ అనౌన్స్ మెంట్  రోజు నుంచే .. భారీ అంచెనాలు నెల‌కొన్నాయి.  తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ మూహుర్తం ఫిక్స్‌ చేసిన‌ది చిత్ర బృందం. ఈ సినిమా ట్రైలర్‌ డిసెంబర్‌ 3 వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.  ఇందుకు సంబంధించిన  ఓ పోస్టర్‌ కూడా  విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఈ నూత‌న అప్‌డేట్‌తో  ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం రెట్టింప‌యింది. ఇక డిసెంబ‌ర్ 3న విడుద‌లయ్యే ట్రైల‌ర్ ఎన్ని రికార్డుల‌ను సొంతం చేసుకుంటుదో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: