ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇటీవ‌ల కోవిడ్ బారీన ప‌డి డిశ్చార్జీ అయిన విష‌యం విధిత‌మే. డిశ్చార్జీ అయిన త‌రువాత‌ మ‌ర‌ల అనారోగ్య బారిన ప‌డి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిన‌దే. అయితే  హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసారు. అయితే కోవిడ్ అనంతర సమస్యలతో  బాధపడుతున్నారు గ‌వ‌ర్న‌ర్‌.

 ఇప్ప‌టికే గ్యాస్ట్రిక్, డయేరియాను గుర్తించిన‌ట్టు  వైద్యులు వివరించారు.  డాక్టర్ నాగేశ్వర రెడ్డి పర్యవేక్షణలో గవర్నర్‌కు ట్రీట్‌మెంట్ కొనసాగుతోంద‌ని మీడియాకు వెల్ల‌డించారు. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్యంపై ఏఐజీ ఆసుప‌త్రి హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం గ‌వ‌ర్న‌ర్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం ఏమి లేద‌ని వెల్ల‌డించారు. వివిధ భాగాల‌కు చెందిన వైద్య నిపుణుల బృందం ఎప్ప‌టిక‌ప్పుడు గ‌వ‌ర్న‌ర్ ఆరోగ్యాన్ని ప‌ర్య‌వేక్షిస్తోంది. గ‌వ‌ర్న‌ర్ కోలుకునే వ‌ర‌కు కొద్ది రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని వైద్యులు వెల్ల‌డించిన‌ట్టు స‌మాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: