తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని విద్యాసంస్థ‌ల్లో కోవిడ్ కేసులు న‌మోదు అవుతున్నాయ‌ని.. విద్యార్థులంద‌రికీ స్క్రీనింగ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నాం అని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి వెల్ల‌డించారు. రాష్ట్రంలోని ప‌లు విద్యాసంస్థ‌ల‌లో కోవిడ్ కేసులు  న‌మోదు కావ‌డంతో ఇవాళ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ముఖ్యంగా విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ఎలాంటి భ‌య‌బ్రాంతుల‌కు గురి కావ‌ద్ద‌ని సూచించారు విద్యాశాఖ మంత్రి.

క‌రోనా నిబంధ‌న‌లను క్ర‌మం త‌ప్ప‌కుండా పాటించాల‌ని, కోవిడ్‌పై ఎప్పుడూ అప్ర‌మ‌త్తంగా ఉంటేనే ద‌రిచేర‌ద‌ని.. కొంచెం నిర్ల‌క్ష్యం చేసినా కోవిడ్ సోకే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు స‌బితాఇంద్రారెడ్డి. ప్ర‌తీ విద్యార్థి త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ ధ‌రించాల‌ని, భౌతిక దూరం పాటించేలా చూడాల‌ని పాఠ‌శాల‌ల యాజ‌మాన్యాల‌ను మంత్రి స‌బితా ఆదేశించారు. ముఖ్యంగా గురుకుల‌, హాస్ట‌ళ్ల విద్యార్థులు చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని చెప్పారు. ఆయా పాఠ‌శాల‌ల సిబ్బంది త‌ప్ప‌కుండా రెండు డోసులు తీసుకోవాల‌ని మంత్రి ఆదేశించారు. కొన్ని చోట్ల పాఠ‌శాల‌ల యాజ‌మాన్యాలు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం దృష్టికి వ‌చ్చింద‌ని.. థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ మిష‌న్ల‌ను, శానిటైజ‌ర్లు నిత్యం పాఠ‌శాల‌లో త‌ప్ప‌నిస‌రిగా ఉంచాల‌ని విద్యాశాఖ‌ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: