తెలంగాణ‌లో వ‌రి వార్ గ‌త కొద్ది రోజుల నుంచి మాట‌ల యుద్ధం కొన‌సాగుతూనే ఉన్న‌ది. ఓ వైపు బీజేపీ, మ‌రోవైపు టీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య త‌రుచూ ఏదో ఒక సంద‌ర్భంలో వ‌రిధాన్యం కొనుగోలుపై అధికార టీఆర్ఎస్‌, రాష్ట్ర బీజేపీ నేత‌లు మాట‌ల‌తో వార్ న‌డుస్తూనే ఉన్న‌ది. తాజాగా సీఎం విలేక‌ర్ల స‌మావేశంలో వ‌రి వార్ పై  మాట్లాడారు. చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌లా, ఉన్మాదిలా మాట్లాడుతున్నారు. ఎంత చెప్ప‌మంటే చెప్ప‌డం లేద‌ని పేర్కొన్నారు కేసీఆర్‌. మేము రైతు బంధులం.. బీజేపీ రైతు రాబంధు పార్టీ అని పేర్కొన్నారు. దాదాపు 700 మంది రైతుల‌ను పొట్ట‌న పెట్టుకున్న పార్టీ బీజేపీ అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.

గ్లోబ‌ల్ హంగ‌ర్ ఇండెక్స్‌లో ప్ర‌పంచ ఆక‌లి సూచిక 116 దేశాల‌ను స‌ర్వే చేస్తే భార‌త్ స్థానం 101 అని ఈ మ‌ధ్య కాలంలో హిందూ పేప‌ర్‌లో అనాల‌సిస్ ఆర్టిక‌ల్ రాసారని గుర్తు చేశారు. సిగ్గు ఉంటే క‌ళ్లు తెర‌వండి..  పాకిస్తాన్ 98 అయితే భార‌త్‌ది 101, బంగ్లాదేశ్‌, నేపాల్ 76 ఉంటే.. సామాజిక బాధ్య‌త ఉంటే ప్రీ రైస్ తీసుకొని చేయాల‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో కేంద్ర మంత్రి ఉంటే లాభం ఉండాలి. తెలంగాణ బీజేపీ నేత‌ల‌ను ఢిల్లీలో ఎవ‌రూ ప‌ట్టించుకోర‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి ఓ సిపాయిలా పోరాడాల‌ని, రైతుల‌తో మోడీ ఉన్న‌ట్ట‌యితే ధాన్యాన్ని కొనిపించు అని కిష‌న్‌రెడ్డికి సీఎం స‌వాల్ విసిరారు. రైతుల జీవితాల‌తో చెల‌గాటం ఆడుతారా అని ప్ర‌శ్నించారు. కేంద్ర మంత్రి పియూష్ గోష‌ల్ కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నార‌ని పేర్కొన్నారు సీఎం.


మరింత సమాచారం తెలుసుకోండి: