తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేదిలేదని వేసవిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపటి క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.  కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేదిలేదని చెప్తుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్యం కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో దారుణంగా వ్యవహరిస్తుంది కాబట్టి వేసవిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండబోవని కాబట్టి రైతులు ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేసుకోవాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

 రైతుల బతుకులతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు తాను స్పష్టంగా చెప్తున్నా ఈ వేసవిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్యం కొనుగోలు చేసేది లేదని పేర్కొన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్ర‌భుత్వంపై సీఎం  కేసీఆర్ గ‌రం గ‌రం అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: