ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌, జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టి విద్యార్థుల ఉప‌యోగ‌క‌రానికి ఇవి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌ని వెల్ల‌డించారు సీఎం జ‌గ‌న్‌. ముఖ్యంగా ఏపీలో  చ‌దువుల‌కు ఇస్తున్న ప్రాధాన్య‌త వ‌ల్ల ఫ‌లితాలు మార్పుకు గుర‌వుతున్నాయి. మంచి ఫ‌లితాలు సాధిస్తున్నారు. ఆలిండియా స‌ర్వే ఆఫ్ హ‌య్య‌ర్ ఎడ్యూకేష‌న్ రిపోర్టులో ఏపీ రాష్ట్రంలో 17 నుంచి 23 మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న విద్యార్థులు గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో 2020 నాటికి 35.2 శాతానికి పెరిగింది. దేశ‌వ్యాప్తంగా ఇదే స‌మ‌యంలో ఈ రేషియో పెరుగుద‌లలో  దేశంలో 3 శాతానికి పైగా ఉంటే..  ఏపీలో 8.6 శాతం పెరిగింది. దేశ‌వ్యాప్తంగా ఎస్సీల‌కు 1.4,   ఎస్టీలో 4.5 శాతం పెరుగుద‌ల న‌మోదు అయితే  ఏపీలో  8.5 ఎస్సీలు, 9.5 శాతం ఎస్టీల‌లో, బాలిక‌ల్లో 2.2 దేశ‌వ్యాప్తంగా ఉంటే.. ఏపీలో బాలిక శాతం 11.03 శాతంగా పెరుగుద‌ల న‌మోద‌యింది.  

చ‌దువుల కోసం భారం ఉండ‌కూడ‌ద‌ని,  ఉన్న‌త చ‌దువుల వ‌ల్ల‌నే పేద‌ల త‌ల‌రాత మారుతుంద‌ని పేర్కొన్నారు. జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన ప‌థ‌కాన్ని తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని గ‌మ‌నించి వారు ఉండ‌డానికి అన్ని ఖ‌ర్చుల‌ను భ‌రించ‌డానికి ఇబ్బంది ఉండ‌కుండా సంవ‌త్స‌రానికి రెండు ద‌ఫాల‌లో ఐటీఐ వారికి రూ.10వేలు, పాలిటెక్నిక్ 15వేలు, డిగ్రీ, ఇంజినిరంగ్‌, మెడిసిన్‌, ఫార్మ‌సీ వంటి కోర్సుల‌కు సంవ‌త్స‌రానికి రూ.20వేలు ఇస్తున్నాం అని వివ‌రించారు. మొత్తం 2,267  కోట్ల రూపాయ‌లు జ‌మ చేయ‌డం జ‌రిగింద‌ని.. మేన‌మామ‌లా మంచి చేసాన‌ని స‌గ‌ర్వంగా తెలియ‌జేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు సీఎం జ‌గ‌న్‌. రెండు ప‌థ‌కాల‌కు క‌లిపి  8526 కోట్లు ఇవ్వ‌గ‌లిగామ‌ని సంతోషంగా తెలియ‌జేస్తున్న‌ట్టు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: