సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి  క‌న్నుమూసారు. గ‌త కొన్ని రోజులుగా కిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. న్యూమోనియాతో బాధ‌ప‌డుతూ ఐసీయూలో చికిత్స పొందుతూ కాసేప‌టి క్రిత‌మే క‌న్నుమూసారు. సాయంత్రం 4.07 నిమిషాల‌కు తుది శ్వాస విడిచారు. గత నెల 24న న్యూమెనియాతో ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్చి ఆసుప‌త్రిలో చికిత్స కోసం జాయిన్ అయ్యారు.  66 ఏండ్ల వ‌య‌స్సు లో కూడా ఎన్నో పాట‌ల‌ను రాసారు.

 టాలీవుడ్ లెజెండరీ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్తతకు గురయ్యారనే విషయం తెలుసుకున్పప్పటి నుండి అభిమానులంద‌రూ ఒక్కసారిగా షాక్కు గుర‌య్యారు. ఆయనకు ఏమైంది అంటూ ఆరా తీసారు. అందులోనూ శ్వాసకోస సంబంధిత సమస్యలున్నాయని.. న్యూమోనియాతో హాస్పిటల్ పాలయ్యారని తెలిసి అనునిత్యం సిరివెన్నెల ఆరోగ్యంపై ఆరా తీసారు. నిగ్గ‌దీసి అడుగు సిగ్గులేని జ‌నాన్ని.. ఇందిర‌మ్మ ఇంటి పేరు కాదురా గాంధీ.. అనే ప‌లు హిట్ పాట‌ల‌ను రాసారు.



మరింత సమాచారం తెలుసుకోండి: