తెలుగు సినిమా గేయరచయిత శ్రీ చేంబోలు సీతారామశాస్త్రి  పరమపదించారని తెలిసి ఎంతో బాధ‌ప‌డ్డాను అని కళాతపస్వి విశ్వనాధ్ చెప్పారు. ఇది చెప్ప‌లేని స్విచ్‌వేషన్‌. మాటల్లో చెప్ప‌లేనిద‌ని, చాలా పెద్ద లాస్ నాకు.  ఇది నమ్మలేని నిజం అని, ఇది నిజంగా జరిగిన నమ్మ లేకుండా ఉన్నాను. ఇది ప‌ర్స‌న‌ల్‌గా నాకు చాలా లాస్ అని వెల్ల‌డించారు కె.విశ్వ‌నాథ్‌.

 బాలసుబ్రమణ్యం చనిపోయినప్పుడు కుడిభుజం పోయింది అనుకున్నాను ఇప్పుడు నా ఎడమ భుజం కూడా పోయింది అనుకుంటున్నా. అత‌నితో ఎంతో స‌న్నిహితంగా ఉండి కుటుంబ స‌భ్యుల‌లాగే ఉండేవారు. నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సిరివెన్నెల సినిమానే ఆయ‌న ఇంటిపేరుగా మారిందని గుర్తు చేసారు. ఆయ‌న రాసే ప్ర‌తి పాట‌ను అభిమానులు ఆద‌రించేవార‌ని.. ఆయ‌న గొప్ప గేయ ర‌చ‌యిత అని గుర్తు చేసారు విశ్వ‌నాథ్‌.  ఎంతో సన్నితంగా ఉండి కుటుంబ సభ్యులు లాగా ఉండే వార‌ని, ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్న‌ట్టు వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: