మా ప్రాంత క‌వి..మా ప్రాంతపు పాట
వెన్నెల‌కు అర్థం.. వికాసానికి ప‌ర‌మార్థం
అన్నీ నేర్పిన క‌వి తూరుపు క‌వి
సిరివెన్నెల‌కు నివాళి


అని యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు ట్వీట్ చేశారు. మంచి సాహిత్యానికి మంచి సాహిత్య సంబంధ ప్ర‌యోజ‌నానికి ఆయ‌న  నిలువెత్తు రూపం అని కీర్తించారు. ఆయ‌న‌కు అక్షరాంజ‌లి ఘ‌టించారు. మారుమూల ప్రాంతం అయిన అన‌కాప‌ల్లి నుంచి వ‌చ్చిన మ‌హోన్న‌త తేజం ఆయ‌న అని, తెలుగు పాట‌కు చిర కీర్తి ప్ర‌సాదించిన స‌రస్వతీ పుత్రుడు ఆయ‌న అని తెలిపారు. న‌వ‌, యువ క‌వితా రీతుల‌ను విశ్లేషించే శ‌క్తి, తెలుగు పాట‌కు ప్ర‌తినిధిగా నిలిచిన రూపం వెర‌సి ఆ శ‌క్తి రూపం ఆయ‌నేన‌ని ఆ శాబ్దిక తేజం ఆయ‌నేనని తెలుపుతూ, శ్రీ‌కాకుళం ప్రజానీకం త‌ర‌ఫున ఆయ‌కు నివాళి ఇచ్చారు. 


"నిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూ
నిద్ర మానుకోగలమా..
ఎంత మంచి స్వప్నమైన అందులోనె ఉంటూ..
లేవకుండ ఉండగలమా..
కలలుగని అవి కలలే అని తెలిసినదే తెలివమ్మా..
కలతలని నీ కిలకిలతో తరిమెయ్యవె చిలకమ్మా..
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి..
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి"



మరింత సమాచారం తెలుసుకోండి: