సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి గొప్ప సాహిత్య వేత్త అని, అత‌ను అక్ష‌రాల‌ను క్ష‌ణాల్లోనే అల్లుకుపోయి పాట రూపంలో మార్చుతాడ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. సిరివెన్నెల‌కు త‌న‌కు ఎన‌లేని అనుబంధం ఉన్న‌ద‌ని గుర్తు చేసారు. తాను న‌టించిన  ఎన్నో సినిమాల్లో పాట‌ల‌ను అద్భుతంగా రాసి ప‌లు సినిమాను హిట్ అందించేందుకు కార‌కులు అయ్యార‌ని గుర్తు చేసుకున్నారు.

ముఖ్యంగా ఆయ‌న మ‌ర‌ణ విని షాక్‌కు గుర‌య్యాను అని వెల్ల‌డించారు.  తెలుగు పాట‌ను కొత్త పుంత‌లు తొక్కించిన మ‌హానీయుడ‌ని కొనియాడారు. ఆయ‌న మ‌న మ‌ధ్య లేర‌నే వార్త విన‌డానికి బాగాలేద‌ని పేర్కొన్నారు. దాదాపు 35 ఏండ్ల పాటు తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో గొప్ప మేధావి అయిన సిరివెన్నెల ఎన్నో పాట‌లు రాసి అవార్డుల‌ను అందుకొని రికార్డుల‌ను సృష్టించార‌ని గుర్తు చేశారు ప‌వ‌న్‌.  తెలుగు పాట‌ను కొత్త పుంత‌లు తొక్కించిన మ‌హ‌నీయుడు సిరివెన్నెల అని, ఆయ‌న సిరివెన్నెల మ‌ర‌ణం తెలుగు సాహిత్యానికి తీర‌ని లోటని..  సిరివెన్నెల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అంటూ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.




మరింత సమాచారం తెలుసుకోండి: