శివ పూజ‌కు చివురించిన సిరి సిరి మువ్వ అని రాశావు బాగుంది కానీ త‌రువాత పంక్తులు ఏమ‌ని రాస్తావు.. అని అడిగారు విశ్వ‌నాథ్ కాశీనాధుని.. నేను రాస్తానండి కాస్త స‌మ‌యం ఇవ్వండి అని అడిగి వ‌చ్చేశారు శాస్త్రి.. అలాపుట్టిన పాట త‌రువాత వ‌ర‌సలు రాయ‌డానికి ఎన్నో నిద్ర లేని రాత్రులు గ‌డిపారు ఆయ‌న. తానున్న‌ వీధుల‌లో అదే ప‌నిగా తిరుగాడుతూ రాసిన పాట ఇది.. స్వ‌ర్ణ క‌మ‌లం సినిమాకు రాసిన ఈ పాట ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీనే! రెండు భిన్న ధ్రువాలున్న వ్య‌క్తుల‌కు మ‌ధ్య జ‌రిగే సంభాష‌ణ‌కు పాట రూపం రాయాలి.. అది క‌వి మాత్ర‌మే చేయ‌గ‌ల‌గాలి.. అందుకే అన్నారు ఏమ‌ని ప‌రుగాప‌క ప‌య‌నించ‌వె త‌ల‌పుల నావా... కెర‌టాల‌కు త‌ల‌వంచితే దొర‌క‌దు తోవ.. ఎదిరించిన సుడిగాలిని జ‌యించినావా.. మ‌ది కోరిన మ‌ధుసీమ‌లు వ‌రించి నావా.. సిరి సిరి మువ్వా.. అంటూ ఆమె అభిప్రాయం చెప్పించారు. ఆమెకు నాట్యం అంటే ఇష్టం లేదు క‌దా క‌నుక ఏమ‌ని చెప్పారు అక్క‌డ ప‌డ‌మర సంధ్య‌ల‌పై మెరిసే తార‌ల‌కై రాత్రిని వ‌రించ‌కే సంధ్యా సుంద‌రీ! అని ఏ ప‌ని చేసినా నేల విడిచి సాము చేయకూడ‌దు ఓ నాట్య మ‌యూరీ అని చెప్పించారు ఉద్భోద చేయించారు అత‌డితో! రాసేందుకు వినేందుకు ఎంత సులువో క‌దూ! కానీ ఈ సంభాషణ రీతిలో పాట రాయ‌డం మెప్పించ‌డం చాలా క‌ష్టం.. అలాంటి ప్ర‌స‌వ వేద‌న‌ల్లో ఆ బాట‌లో ఆయ‌న ఎన్నో సార్లు స‌ఫ‌లీకృతం అయి విజేత‌గా నిలిచారు. మంచి పాట‌లే రాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: