కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇండియా-పాకిస్తాన్ సరిహద్దుకు వెళ్లనున్నారు. ముఖ్యంగా ఒక రోజు రాత్రి అక్కడే గడపనున్నారు హోంమంత్రి.  డిసెంబర్ 4న రాజస్థాన్ లోని జైసల్మీన్ పర్యటించి, బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి అంతర్జాతీయ సరిహద్దు దగ్గర ఉండనున్నారు అమిత్‌షా.  బీఎస్ఎఫ్ జవాన్లతో అక్క‌డ మాట్లాడనున్నారు కేంద్ర మంత్రి.  ఇదిలా ఉండ‌గా తొలిసారిగా స‌రిహ‌ద్దుల్లో గ‌డిపిన మొద‌టి హోంమంత్రిగా అమిత్‌షా నిల‌వ‌నున్నారు.  
కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ముఖ్య‌నేత‌లంద‌రూ త‌రుచుగా ఆర్మీ, భ‌ద్ర‌తా ద‌ళాల వ‌ద్ద‌కు చేరుకుంటూనే ఉన్నారు. దీపావ‌ళి పండుగ సంద‌ర్భంలో కాశ్మీర్‌లో స‌రిహ‌ద్దుల వ‌ద్ద ఆర్మీతో క‌లిసి సంబురాలు చేసుకున్నారు ప్ర‌ధాని మోడీ. అంత‌కు ముందుకు రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ కూడా భ‌ద్ర‌త ద‌ళాల వ‌ద్ద‌కు వెళ్లారు. ముఖ్యంగా భ‌ద్ర‌త ద‌ళాల్లో మ‌రింత ధైర్య‌మును నింపేందుకు నాయ‌కులు ప‌ర్య‌ట‌న‌లు చేప‌డుతున్నారు. ఇక ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌తీ సంవ‌త్స‌రం దీపావ‌ళి పండుగ స‌మ‌యంలో సైన్యంతోనే గడుపుతున్నారు. ఇక ఈనెల 4న వ‌చ్చే శ‌నివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బీఎస్ఎఫ్ ద‌ళాల‌తో క‌ల‌వ‌నున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: