ఇవాళ ఉద‌యం 6 గంట‌ల స‌మ‌యంలో సిరివెన్నెల‌సీతారామశాస్త్రిని కిమ్స్ ఆసుప‌త్రి నుంచి ఫిల్మ్ చాంబ‌ర్‌కు త‌ర‌లించారు. సిరివెన్నెల‌ను అభిమానులు సంద‌ర్శించేందుకు ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఫిల్మ్‌ఛాంబ‌ర్‌లో పార్థివ దేహాన్ని ఉంచ‌నున్నారు. మంగ‌ళ‌వారం సాయంత్రం నుంచి బుధ‌వారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు సిరివెన్నెల మృత‌దేహాన్ని కిమ్స్ ఆసుప‌త్రిలోనే ఉంచారు. కిమ్స్ ఆసుప‌త్రి నుంచి 6 గంట‌ల త‌రువాత ఫిల్మ్‌ఛాంబ‌ర్‌కు పార్థివ‌దేహాన్ని త‌ర‌లించారు.

ఇవాళ మ‌హాప్ర‌స్థానంలో సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి అంత్య‌క్రియ‌లు నిర్విహించ‌నున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌రుపున మంత్రి పేర్నినాని అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రుకానున్నారు. సిరివెన్నెల మృతి ప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు మృతి చెందిన వార్త తెలుయ‌గానే ట్విట్ట‌ర్ ద్వారా కొంద‌రూ.. నేరుగా కొంద‌రూ ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నారు. ముఖ్యంగా  సిరివెన్నెల సొంత జిల్లా అయిన విశాఖ జిల్లా నుంచి అభిమానులు ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. అభిమానులు, ప‌లువురు సినీ ప్ర‌ముఖుల సంద‌ర్శ‌నార్థం కోసం బుధ‌వారం ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఫిల్మ్ ఛాంబ‌ర్‌లోనే సిరివెన్నెల పార్థివ‌దేహాన్ని ఉంచ‌నున్నారు. ముఖ్యంగా అగ్ర‌ద‌ర్శ‌కులు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌,  సంగీత ద‌ర్శ‌కులు ఎం.ఎం.కీర‌వాణిలు సిరివెన్నెల పార్థివ‌దేహం వ‌ద్దే ఉన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: