తిరుమ‌ల రెండవ‌ క‌నుమ దారిలో ఒక్క‌సారిగా కొండ‌ చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. కొండ‌పై నుంచి ర‌హ‌దారిపై బారీ బండ‌రాయి కింద ప‌డింది. దీనితో ర‌హ‌దారి మూడు చోట్ల పాక్షికంగా ధ్వంసం అయింది. కొండ చ‌రియ‌లు విరిగిప‌డిన‌ప్పుడు ఈ ర‌హ‌దారి గుండా వ‌స్తున్న ఆర్టీసీ బ‌స్సుకు క్ష‌ణంలోనే పెను ప్ర‌మాదం త‌ప్పింది. వెంట‌నే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం స్పందించి ముందు జాగ్ర‌త్త‌గా చ‌ర్య‌గా ఈ మార్గంలో కొండ‌పైకి వెళ్లే వాహ‌నాల‌ను తాత్కాలికంగా నిలిపి వేసారు.

ఇందుకు ప్ర‌త్యామ్న‌యంగా లింక్ రోడ్డు నుంచి విడుత‌ల వారీగా కొండ మీద‌కు పంపించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కొండ పై నుంచి కింద‌కి వ‌చ్చే వాహ‌నాల‌కు ఎలాంటి ఇబ్బందులు లేవు అని టీటీడీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ర‌హ‌దారిపై ప‌డిన రాళ్ల‌ను సిబ్బంది ఇప్ప‌టికే తొల‌గించ‌డం మొద‌లెట్టారు. మ‌రికొద్ది కాసేప‌ట్లోనే రాక‌పోక‌ల‌ను అనుమ‌తించే అవ‌కాశం క‌నిపిస్తోంది. తిరుమ‌ల‌లో భారీ వ‌ర్షం కురిసిన నేప‌థ్యంలోనే ఒక్క‌సారిగా కొండ చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: