సాధార‌ణంగా తుఫాన్ సంభ‌వించే స‌మ‌యంలో స‌ముద్రం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డుతూ ముందుకొస్తూ ఉంటుంది. తుఫాన్ సంభ‌వించే సంద‌ర్భాల‌లో అలలు ఒక్క‌సారిగా ఎగిసి ప‌డుతుంటాయి. కొంత మంది మ‌త్య్స కారుల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తుంటారు అధికారులు. ఎవ‌రూ స‌ముద్రంలోకి చేప‌ల వేట‌కు వెళ్లొద్ద‌ని సూచ‌న‌లు చేస్తూ.. ముంద‌స్తుగానే స‌మాచారం ఇచ్చి జాల‌ర్ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తుంటారు.

కానీ తుఫాన్ సంభ‌వించిన స‌మ‌యంలో స‌ముద్రం ముందుగా రాకుండా కాస్త వెన‌క్కి వెళ్లింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌న‌గ‌రం జిల్లా బోగాపురం మండలం ముక్కాం గ్రామం వ‌ద్ద స‌ముద్రం ఒక్క‌సారిగా ఉన్న‌ట్టుండి వంద మీట‌ర్ల వ‌ర‌కు వెన‌క్కి వెళ్లింది. ఇది గ‌మ‌నించిన మ‌త్య్స కారులు ఒక్క‌సారిగా ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ముఖ్యంగా పౌర్ణ‌మి, అమ‌వాస్య స‌మ‌యాల‌లోనే ఇలాంటి ఘ‌ట‌న చోటు చేసుకుంటుంద‌ని వాపోతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఎప్పుడు ఇలా జ‌ర‌గ‌లేద‌ని వాపోతున్నారు. తుపాన్ స‌మ‌యంలోనే ఎప్పుడు ఇలా చోటు చేసుకోలేద‌ని..  వంద మీట‌ర్లు వెన‌క్కి వెళ్ల‌డం ఇదే తొలిసారి అని స్థానికులు పేర్కొంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: