అడ‌వి జంతువుల బారీ నుండి పంట‌చేల‌కు అమ‌ర్చిన విద్యుత్ కంచెలు మ‌నుషుల పాలిట మృత్యుపాషాలుగా మారిపోతూ ఉన్నాయి. ప్ర‌మాద‌వ‌శాత్తు వాటి బారిన ప‌డి ప‌లువురు ప్రాణాల‌ను కోల్పోతున్నారు. తాజాగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యుత్ కంచెలు త‌గిలి ఓ మ‌హిళ మృతి చెందిన‌ది. మ‌రొక ముగ్గురు మ‌హిళ‌లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.  కొమురం భీం జిల్లా వాంకిడి మండ‌లం న‌వేగామ్ గ్రామ‌పంచాయ‌తీ ప‌రిధిలోని టొక్కిగూడ‌లో ఈఘ‌ట‌న చోటు చేసుకుంది.

అర్థ‌రాత్రి ఈ ప్ర‌మాదం చోటు చేసుకోవ‌డంతో తాజాగా ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చిన‌ది.  దీనికి తోడు ఆ గ్రామానికి రోడ్డు మార్గం కూడా లేక‌పోవ‌డంతో  బాధితుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించ‌డం కాస్త ఆల‌స్యంగా మారిన‌ది.   టోక్కిగూడ గ్రామానికి చెందిన బుతూ నీలాబాయి, రాజ‌క్క‌, బీమ‌క్క‌లు భీంరావు గుట్ట స‌మీపంలోని చెరువులో రాత్రి స‌మ‌యంలో చేప‌లు ప‌ట్టేందుకు వెళ్లారు. తిరిగి ఇంటికి వ‌స్తుండ‌గా పంట చేనుకు అమ‌ర్చిన విద్యుత్ కంచెలు త‌గ‌ల‌డంతో షాక్‌కు గురై ఓ మ‌హిళ మృతి చెందింది. ముగ్గురు తీవ్ర‌గాయాల పాలు కావ‌డంతో.. స్థానికులు వారిని  చికిత్స కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: