ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని  వ‌రద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యట‌న ఇప్ప‌టికే మొద‌లు పెట్టారు.  తిరుపతిలోని కృష్ణానగర్‌ను ఇవాళ ఉద‌యం సీఎం పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించి.. వరదలకు దెబ్బతిన్న ఇండ్ల‌ను స్వ‌యంగా ముఖ్య‌మంత్రి  పరిశీలించారు. ప్రభుత్వం అన్ని విధాల వ‌ర‌ద బాధితుల‌కు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు జ‌గ‌న్‌. వరద నష్టాలపై ఫోటో గ్యాలరీని  తిలకించారు సీఎం. రేణిగుంట విమానాశ్రయం నుంచి  నెల్లూరు జిల్లా పర్యటనకు కూడా ఇవాళ సీఎం వెళ్లనున్నారు.

తిరుప‌తిలో వ‌ర‌ద ప్రాంతాలను ప‌రిశీలిస్తున్న జ‌గ‌న్‌ను ఉద్యోగ సంఘాల నేత‌లు క‌లిసారు. పీఆర్సీ ప్ర‌క‌టించాల‌ని ఉద్యోగులు సీఎంను కోరారు. అంశంపై క్లారీటీ ఇచ్చారు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌. ఉద్యోగులు సీఎంను క‌లిసి పీఆర్సీ ప్ర‌క్రియ పూర్త‌యింది. ప‌ది రోజుల్లోనే ప్ర‌క‌టిస్తాం అని సీఎం జ‌గ‌న్ హామీ ఇచ్చారు.  నిన్న వరద ప్రభావిత ప్రాంతాలైన వైఎస్సార్‌ జిల్లా రాజంపేట మండలం పులపత్తూరు, ఎగువ మందపల్లె, దిగువ మందపల్లె గ్రామాల్లో, చిత్తూరు జిల్లా వెదళ్లచెరువు ఎస్టీ కాలనీలో సీఎం పర్యటించారు. ధ్వంసమైన ఇండ్లు, వంతెనలను పరిశీలించారు. తొలుత పులపత్తూరులో కాలినడకన గ్రామం మొత్తం కలియదిరుగుతూ స్వయంగా బాధితులతో ముఖ్య‌మంత్రి మాట్లాడారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి భరోసా క‌ల్పించారు. బాధితులకు సురక్షిత ప్రదేశంలో ఐదు సెంట్ల స్థలం  ఇవ్వ‌డంతో పాటు .. ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఇల్లు కూడా నిర్మించి  ఇస్తుందని హామీ ఇచ్చారు సీఎం జ‌గ‌న్‌.






మరింత సమాచారం తెలుసుకోండి: