భార‌త ప్ర‌థ‌మ పౌరుడు అయిన రాష్ట్రప‌తి శీతాకాల‌ విడిది కోసం హైదరాబాద్‌కు రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేసేందుకు ఆయన డిసెంబర్ 20న రానున్నారని రాష్ట్రపతి భవన్ తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడంతో తెలంగాణ అధికారులు ఇటీవ‌ల‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. ఈ ఏర్పాట్లపై కంటోన్మెంట్‌, జీహెచ్‌ఎంసీ అధికారులతో మేడ్చల్‌ కలెక్టర్‌ హరీష్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు.

 డిసెంబర్ చివరి వారంలో హైద‌రాబాద్‌ నగరానికి రానున్న రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఈనెల 20 నుంచి 24 వ‌ర‌కు ఐదు రోజుల పాటు బస చేయనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో దిండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకోనున్నారు.  అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా బొల్లారం చేరుకుంటారు.  ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రోటోకాల్ విభాగం చేపట్టిన‌ది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా  ఇప్ప‌టికే ఆక్టోపస్ పోలీసులు రాష్ట్రపతి నిలయంలో మాక్‌ డ్రిల్ చేపట్టారు. అయితే ఓమిక్రాన్ కేసుల ఉధృతి ఆధారంగా మార్పు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్టు రాష్ట్రప‌తి నిల‌యం అధికార వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: