ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌చివాల‌యంలోని ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో  మ‌రికొద్ది సేప‌ట్లోనే రాష్ట్ర ఆర్థిక‌, సాధార‌ణ‌, ప‌రిపాల‌న శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శులు రావ‌త్‌, శ‌శిభూష‌న్‌కుమార్ స‌మావేశం నిర్వ‌హించారు. పీఆర్‌సీతో పాటు ఉద్యోగుల డిమాండ్ల‌తో చ‌ర్చ కొలిక్కి రానుంది. పీఆర్సీ పై చ‌ర్చించేందుకు రావాల‌నే ఉద్యోగ సంఘాల నేత‌లకు స‌మాచారం అందించిన‌ది ప్ర‌భుత్వం.

పీఆర్సీ స‌హా ప్ర‌భుత్వం ముందుంచిన ప‌లు డిమాండ్స్ పై స‌మావేశంలో చ‌ర్చించాల‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు  ప‌ట్టుబ‌ట్ట‌నున్నారు. ఇప్ప‌టికే ఏపిజేఏసీ, ఏపిజేఏసీ అమ‌రావ‌తి నేతలు  సీఎస్ స‌మీర్ శ‌ర్మ‌కు ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌ నోటీస్ అందించారు. ప‌ది రోజుల్లో పీఆర్సీ ప్ర‌క‌టిస్తామ‌ని తిరుప‌తిలో త‌న‌ను క‌లిసిన ఉద్యోగుల‌కు హామీ ఇచ్చారు సీఎం జ‌గ‌న్. ఇప్పుడు జ‌రిగే స‌మావేశంలో ఉద్యోగ సంఘాల‌కు క్లారిటీ ఇవ్వ‌నున్నారు ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులు. త‌మ ప్ర‌ధాన డిమాండ్ల ప‌రిష్క‌రానికి హామీ రాకుండా ఉద్య‌మం నుంచి వెన‌క్కి త‌గ్గేది లేద‌ని పేర్కొంటున్నారు ఉద్యోగ సంఘాల నేత‌లు.

మరింత సమాచారం తెలుసుకోండి: