ప్ర‌పంచ వ్యాప్తంగా అంద‌రినీ  వ‌ణికిస్తున్న ఓమిక్రాన్ భార‌త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన‌ద‌ని..  ఇప్ప‌టికే క‌ర్నాట‌క‌లో రెండు కేసులు న‌మోదు అయ్యాయ‌ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మ‌న్‌సుఖ్ మాండవీయ స్ప‌ష్టం చేసారు.  గురువారం రోజు క‌ర్నాట‌క రాష్ట్రంలో ఇద్దరికి  ఒమిక్రాన్ సంభ‌వించింద‌ని వెల్ల‌డించారు. అయితే ఇప్ప‌టికే వారి ఇద్ద‌రికి ప్రైమ‌రీ, సెకండ‌రీ కాంటాక్టును గుర్తించడాన్ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రారంబించింద‌ని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

 అయితే ఓమిక్రాన్ పై రాజ‌కీయాలు చేయ‌డం త‌గ‌ద‌ని  కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మ‌న్‌సుఖ్ మాండవీయ స్ప‌ష్టం చేసారు. లోక్ స‌భ‌లో ఇవాళ కేంద్ర ఆరోగ్య‌మంత్రి మాట్లాడుతూ..  ఓమిక్రాన్ క‌ట్ట‌డికి కేంద్రం సిద్ధంగా ఉంద‌ని స్ప‌ష్టం చేసారు. ఓమిక్రాన్ కొత్త‌వేరియంట్‌పై ప్ర‌తిప‌క్ష నాయ‌కులు రాజ‌కీయం చేస్తున్నార‌ని .. దేశంలో ఇలాంటి క‌రోనా లాంటి వ్యాధులు సంక్ర‌మించిన‌ప్పుడు ప్ర‌తిప‌క్షాలు, అధికార పార్టీల నాయ‌కులు క‌లిసి మెలిసి ప‌ని చేసి దేశ ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ ఇవ్వాల‌ని చెప్పారు. కొంత మంది దుష్ప్రాచారం చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అని కేంద్ర ఆరోగ్య మంత్రి ప్ర‌శ్నించారు. రాజ‌కీయాల‌కు ఓమిక్రాన్‌ను అంటు పెట్టొద్ద‌ని సూచ‌న‌లు చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: