ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని మంత్రి హరీశ్‌ రావు  పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆయనకు మిత్రులు ఉన్నారని.. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ప్రత్యేక శైలిని చాటుకున్న రోశయ్య మృతిచెందడం బాధాకరం అని తెలిపారు మంత్రి హ‌రీశ్‌రావు.  మృతి చెందిన రోశ‌య్య‌ ఆత్మకు శాంతి చేకూరాలని ఆంకాంక్షించారు.

దేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర శాసన సభలో 15 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత  కేవ‌లం రోశ‌య్య‌కే దక్కుతుందన్నారు హ‌రీశ్‌రావు.  రాష్ట్రంలో ఆయన చేయని పదవీ లేద‌ని..  గౌరవం లేదని.. ఆయ‌న పనిచేసిన అందరూ సీఎంలో మన్ననలు పొందారని పేర్కొన్నారు.  

మాజీ సీఎం రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని  లోటు అని మంత్రి హరీష్ రావు చెప్పారు. ముఖ్యంగా రోశ‌య్య ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జ‌రిగింద‌ని గుర్తు చేసారు. రోశయ్య హయాంలోనే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేశారని.. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో అనేక సార్లు రోశ‌య్య‌తో చ‌ర్చ‌లు జ‌రిపాం అని గుర్తు చేశారు హరీశ్ రావు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ‌మైన‌ సానుభూతి తెలిపారు హ‌రీశ్ రావు. 

మరింత సమాచారం తెలుసుకోండి: