న‌ల్ల‌గొండ జిల్లాలోని అయిటిపాములలో  భారీ అగ్నిప్రమాదం సంభవించిన‌ది. ఫేర్రోలైస్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు ఎగసిపడుతుండ‌డంతో.. 3 ట్రాన్స్‌ఫార్మర్లు పేలడంతో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంట‌నే సంఘటనాస్థలానికి చేరుకుని  మంటలను అదుపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  వివరాల్లోకి వెళ్లితే.. న‌ల్ల‌గొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాములలో అగ్ని ప్రమాదం సంభ‌వించిన‌ది.  

గ్రామ శివారులోని శ్రీ రాఘవేంద్ర ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలో ఆదివారం ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా మంట‌లు ఎగిసి ప‌డ్డాయి.  భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు ప్ర‌య‌త్నం చేసారు. ట్రాన్స్‌ఫార్మర్‌లో ఆయిల్‌ లీకేజీ వల్ల అగ్ని ప్రమాదం జ‌రిగిన‌ట్టు తెలిసిన‌ది. అగ్ని ప్రమాదం వల్లనే భారీగా ఆస్తినష్టం జరిగిందని యాజమాన్యం పేర్కొంటున్న‌ది. సుమారు రూ.60 లక్షల నష్టం జరిగిందని.. పరిశ్రమ యాజమాన్యం వెల్లడించిన‌ది. ఎటువంటి ప్రాణహాని జరగకుండా కార్మికులందరినీ బయటకు పంపించిన‌ట్టు తెలిపింది. మరోవైపు హైవేపై దట్టమైన పొగ అలుముకుని..  సమీప గ్రామాల ప్రజల‌లో ఆందోళన నెలకొన్న‌ది.

మరింత సమాచారం తెలుసుకోండి: