అల్లు అర్జున్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసిన క్షణం రానే వచ్చిన‌ది. ‘పుష్ప’ ట్రైలర్ ని మేకర్స్ తాజాగా విడుద‌ల చేసారు.  కొన్ని సాంకేతిక కారణాలవలన ఆలస్యం అయ్యిందని చెప్పినా.. అభిమానుల కోరిక మేరకు ట్రైలర్  విడుదల చేసారు. బన్నీ- సుకుమార్ కాంబినేష‌న్  వస్తున్న మూడవ‌ చిత్రం పుష్ప  కావడంతో ఈ సినిమాపై భారీగానే అంచెనాలు పెట్టుకున్నారు అభిమానులు.   ట్రైలర్ విషయానికొస్తే ఆద్యంతం ఉత్కంఠను రేపుతున్న‌ది ‘పుష్ప’ రాజ్ గా బన్నీ మాస్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

శేషాచలం అడవులలో అరుదుగా దొరికే ఎర్రచందనం చెక్కలను స్మగ్లింగ్ చేస్తూ అక్కడి వారు బతుకుతుంటారు.  గంధపు చెక్కల స్మగ్లర్ గా పుష్పరాజ్ పనిచేస్తుంటాడు.. వాటిని పోలీసులకు తెలియకుండా రాష్ట్రం దాటిస్తుంటాడు.  వీరిద్దరి మధ్య జరిగే ఓ యుద్ధమే పుష్ప.. పోలీసులకు, స్మగర్లకు మధ్య రాజకీయ నాయకులు, దళారులు ఎలా వీరిని వాడుకున్నారు అనేది చూపించారు.  ఇక మధ్యలో పుష్ప, శ్రీవల్లీల రొమాన్స్ ఎంత‌గానో ఆకట్టుకుంటున్న‌ది. ముఖ్యంగా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్.. తగ్గేదెలే అనే డైలాగ్స్ అల్లు అర్జున్ అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాయి. ఇక చివర్లో ఫహద్ ఫాజిల్ పార్టీ లేదా పుష్ప అంటూ వెటకారంగా అన్న డైలాగ్ ట్రైలర్ కి హైలెట్ అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: