టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత  నిత్యం ప్ర‌స్తుతం వార్త‌ల్లోనే ఉంటుంది.  ఆమె ఏదీ ట్వీట్ చేసినా.. ఇన్ స్టా పోస్ట్ పెట్టినా కానీ అది చాలా  వైరల్ గా అవుతుంది.  తాజాగా స‌మంత పుష్ప  సినిమా ట్రైలర్ పై  పెట్టిన పోస్ట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయింది.  పుష్పరాజ్‌ తగ్గేదే లే.. అని అల్లు అర్జున్ ట్రైలర్ రిలీజ్ ట్వీట్ ను సమంత రీ ట్వీట్ చేసిన‌ది . పుష్ప -దరైజ్ 1 డిసెంబర్ 17న థియేటర్లలోకి వస్తోందంటూ హ్యాష్ ట్యాగ్స్ పెట్టింది సమంత. ఆమె చేసిన ఈ ట్వీట్ ను సమంత ఫ్యాన్స్ పాజిటివ్ గా తీసుకోగా.. అక్కినేని- సమంత ఉమ్మడి అభిమానులు మాత్రం కాస్త‌ నెగిటివ్‌గా  రియాక్టవుతున్నారు.

బంగార్రాజు సినిమాలో నాగచైతన్య-కృతి శెట్టిపై తీసిన ‘నాకోసం’ పాటను ఇటీవలే  విడుద‌ల చేసారు. అయితే  సిరివెన్నెల రాసిన‌ ఈ పాటను సమంత ఎందుకు రియాక్ట్ కావడం లేదని కొందరు నెటిజన్లు కామెంట్లలో ప్ర‌శ్నించారు.  స‌మంత మ‌రీ దీని సంగ‌తి ఏమిటి అంటూ ఫోటోలు పోస్ట్ చేసి నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

స‌మంత పుష్ప సినిమా ట్రైల‌ర్ ను మాత్ర‌మే ఎందుకు రీట్విట్ చేసిన‌ద‌ని మ‌రొక ఆస‌క్తిక‌ర‌మైన అంశంగా నిలిచింది. అయితే స‌మంత త‌న కెరీర్‌లోనే తొలిసారిగా ఓ ఐట‌మ్ సాంగ్‌ను పుష్ప కోసం చేసింది. దీనికి సంబంధించిన లుక్ లో స‌మంత సిజ్లింగ్ గా కనిపిస్తున్న‌ది. నాగచైత‌న్య‌తో విడాకులు ప్ర‌క‌టించిన త‌రువాత స‌మంత వెండితెర‌పై క‌నిపించ‌నున్న తొలి సినిమా పుష్ప‌.  పుష్ప స‌మంత  పాట కోసం అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు. త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నట్టు ప్ర‌క‌టించింది చిత్ర బృందం. పుష్పతో సమంత కాంబినేషన్ కు సంబంధించి ఇంత హైప్ ఉందనే.. తాను  రీట్వీట్ చేసిందని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: