ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ  మ‌ధ్య ప్ర‌తిప‌క్ష టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల వార్ నిత్యం రోజుకొక‌సారి చోటు చేసుకుంటూనే ఉంటుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైరయ్యారు. ఇసుక అక్రమాలకు ఏపీలో అడ్డూ అదుపు లేకుండా పోతుందని పేర్కొన్నారు. ఇసుక అక్రమ తవ్వకాల వల్లనే 39 మంది జల సమాధి అయ్యారని నారా లోకేష్ ఆరోపణ‌లు చేసారు.  అన్నమయ్య ప్రాజెక్టులో మృతుల కుటుంబాలు తేరుకోక ముందే ఇసుక ట్రాక్టర్లు గ్రామాలలో అలజడి సృష్టిస్తున్నాయి అని నారా లోకేష్  సీఎం జ‌గ‌న్ పై మండిప‌డ్డారు.

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి జ‌నం కంటే ధ‌న‌మే ముఖ్య‌మైన‌ద‌ని నారా లోకేష్ ఆరోపించారు. క‌డ‌ప జిల్లా నంద‌లూరు మండ‌లంలో ఇసుక విక్ర‌యాల‌ను వెంట‌నే ప్రారంభించ‌డం ఏమిటి అని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్ర‌శ్నించారు. ఇసుక మాఫియాతో ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోతున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోకుండా ప‌ట్ట‌న‌న్ను వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని పేర్కొన్నారు నారా లోకేష్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: