తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌రస్వామి వారి ఆల‌యంలో డిసెంబ‌ర్ 17 నుండి సుప్ర‌బాతం స్థానంలో తిరుప్పావై ప‌ఠించ‌నున్నారు. తిరుమ‌ల వేకంటేశ్వ‌రుని మాసోత్స‌వాల‌లో అత్యంత‌మైన‌ది భావించే ధ‌నుర్మాసం డిసెంబ‌ర్ 16వ తేదీన ఆరంభం కానున్న‌ది. డిసెంబ‌ర్ 16 మ‌ధ్యాహ్నం 12.26 గంట‌ల‌కు ధ‌నుర్మాస ఘ‌డియ‌లు మొదలు కానున్న త‌రుణంలో డిసెంబ‌ర్ 17 నుంచి స్వామివారికి నిర్వ‌హించే సుప్ర‌బాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. ధ‌నుర్మాస ఘ‌డియ‌లు 2022, జ‌న‌వ‌రి 14న ముగిసిపోనున్నాయి.

పురాణాల ప్ర‌కారం.. ధ‌నుర్మాసంలో దేవ‌తలు సూర్యోద‌యానికి ఒక‌టిన్న‌ర గంట‌ల ముందుగా నిద్ర‌లేచి బ్ర‌హ్మ మూహుర్తంలో శ్రీ‌మ‌హావిష్ణువును ప్ర‌త్యేకముగా ప్రార్థిస్తారు. ఈ మాసానికి సౌర‌మానంలో ప్ర‌త్యేక‌మైన ప్రాధాన్య‌త ఉన్న‌ది. 12 మందిగా చెప్పుకునే ఆళ్వార్ల‌లో శ్రీ ఆండాల్ గోదాదేవి ఒక‌రు. ఈమెను నాచియార్ అని కూడా పిల‌స్తుంటార‌ని.. శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారిని స్తుతిస్తూ ఆండాల్ ర‌చించిన 30 పాశురాల‌ను క‌లిపి తిరుప్పావై అని పేర్కొంటారట‌. ఆళ్వారు దివ్య ప్ర‌బంధంలో తిరుప్పావై కూడా ఒక భాగంఅని.. త‌మిళ సాహిత్యంలో  విశేష ప్రాచుర్యం ఉన్న‌ది. శ్రీ‌వారి ఆల‌యంలో నెల రోజుల పాటు కొన‌సాగే తిరుప్పావై పారాయ‌ణంలో రోజుకు ఓ పాశురం వంతున అర్చ‌కులు నివేదిస్తార‌ని..సాధార‌ణంగా భోగ శ్రీ‌నివాస‌మూర్తికి బ‌దులుగా శ్రీ‌కృష్ణ‌స్వామి వారికి ఏకాంత సేవ నిర్వ‌హిస్తుంటారు.అయితే డిసెంబ‌ర్ 17 నుంచి నిర్వ‌హించే తిరుప్పావై ప‌ఠనం పూర్తిగా ఏకాంతంగా జ‌రుగ‌నున్న‌ది.

మరింత సమాచారం తెలుసుకోండి: