దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో ఆత్రుత‌గా ఎదురూ చూస్తూ ఉన్నారు అభిమానులు. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఇద్ద‌రూ స్టార్ హీరోలైన రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌తో అగ్ర‌ద‌ర్శ‌కుడు, ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి రూపొదిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ కావ‌డంతో ఆత్రుతుగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వ‌చ్చిన ప్ర‌తీ అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో తెర వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్, రామ్‌చర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీగానే అంచెనాలు పెట్టుకున్నారు. ఈ ఆర్ఆర్ఆర్ నుంచి విడుద‌లైన పోస్ట‌ర్లు, సాంగ్స్‌, వీడియోలు నెట్టింట్లో సంచ‌ల‌నంగా మారి రికార్డుల మోత మోగిస్తూనే ఉన్నాయి.

సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా  2022 జనవరి 7న  ప్రపంచవ్యాప్తంగా విడుదల  విడుద‌ల చేయ‌నున్నట్టు గ‌తంలోనే ప్ర‌క‌టించిన విష‌యం విధిత‌మే. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్‌ను గురువారం విడుద‌ల చేయ‌నున్న నేప‌థ్యంలో ఇవాళ బుధ‌వారం ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ వీడియోను మేక‌ర్స్ తాజాగా విడుద‌ల చేసారు. కేవ‌లం ఎన్టీఆర్ స్ట‌న్నింగ్స్ విజువ‌ల్స్ మాత్ర‌మే చూపించి ఆస‌క్తి రేకెత్తించారు చిత్ర బృందం. నిన్న మేక‌ర్స్ వ‌రుసగా రామ్‌చ‌ర‌ణ్‌, అలియాభ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌న్ మేకింగ్  వీడియోల‌ను పంచుకున్న విష‌యం విధిత‌మే. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌కు సంబంధించిన వీడియోల అప్‌డేట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన‌ది.


మరింత సమాచారం తెలుసుకోండి: