త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కూనురు స‌మీపంలో  ఆర్మీ హెలికాప్ట‌ర్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఒక్క‌సారిగా కూలిపోయింది. అక్క‌డ కొన్ని రోజులుగా వ‌ర్షాలు ప‌డ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు భావిస్తున్నారు. అయితే ఈ ప్ర‌మాదానికి కార‌ణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉన్న‌ది. సాంకేతిక లోప‌మా లేక వాతావ‌ర‌ణం అనుకూలించ‌క కూలిపోయిందా అనేది కొద్ది సేప‌ట్లో క్లారిటీ రానున్న‌ది.

ఆర్మీ ఛీఫ్  డిఫెన్స్ బిపిన్ రావ‌త్ ఆ హెలికాప్ట‌ర్‌లో ఉన్న‌ట్టు స‌మాచారం తెలుస్తోంది. ముగ్గురికి తీవ్ర గాయాలు కావ‌డంతో వెంట‌నే ఆసుప‌త్రికి త‌రించారు.   బిపిన్ రావ‌త్‌తో ఉన్న ముగ్గురు అందులో టాప్  ఆర్మీ ఉన్న‌తాధికారులు కావ‌డం గ‌మ‌నార్హం. హెలికాప్ట‌ర్ లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావ‌త్ తో ప్ర‌యాణిస్తున్న ముగ్గురు అధికారుల‌కు తీవ్ర గాయాలైన‌ట్టు తెలుస్తున్న‌ది. వెంట‌నే స్పందించిన విప‌త్తు బృందం వీరిని ఆసుప‌త్రికి త‌రిలించిన‌ట్టు స‌మాచారం. ఈ ఘ‌ట‌న తెలుసుకున్న ప‌లువురు ఆర్మీ అధికారులు వెంట‌నే విల్లింగ్‌ట‌న్ బేస్ నుంచి ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని క్ష‌త‌గాత్రుల‌ను విల్లింగ్ట‌న్ బేస్‌కు త‌ర‌లించారు.
 
 ప్ర‌మాదంలో న‌లుగురు మృతి చెందార‌ని నీల‌గిరి క‌లెక్ట‌ర్ ప్ర‌క‌టించారు. ప్ర‌మాద స‌మ‌యంలో మొత్తం హెలికాప్ట‌ర్‌లో 14 మంది ప్ర‌యాణించారు. తీవ్ర గాయాల‌తో ముగ్గురు బ‌య‌ట‌ప‌డ్డారు. గల్లంతైన మ‌రొక‌రి కోసం గాలింపులు కొన‌సాగుతున్నారు.  ఎంఐ17వీ5 హెలికాప్ట‌ర్ ప్ర‌మాదానికి గురైంది. ప్ర‌మాదంలో న‌లుగురు మృతి చెందారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించి  ఐఏఎఫ్ విచార‌ణ‌కు ఆదేశించినది. స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: