త‌మిళ‌నాడు రాష్ట్రంలో కూను రు స‌మీపంలో సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ ప్ర‌యాణిస్తున్న హెలికాప్ట‌ర్ కూలిన నేప‌థ్యంలో కేంద్ర క్యాబినేట్ అత్య‌వ‌స‌రంగా భేటీ అయింది. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌మ‌క్షంలో కేంద్ర క్యాబినెట్ స‌మావేశం కొన‌సాగుతున్న‌ది. మిలిట‌రీ హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలిన ప్ర‌మాదంలో న‌లుగురు మృతి చెంద‌గా.. అందులో ఇప్ప‌టికే ఇద్ద‌రినీ గుర్తించారు.

ప్ర‌మాదంపై ప్ర‌ధాని మోడీకి ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివ‌రించిన‌ట్టు స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌పై కాసేప‌ట్లో పార్ల‌మెంట్‌లో రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.   ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించి  ఐఏఎఫ్ విచార‌ణ‌కు ఆదేవించిన‌ట్టు ఉన్న‌తాధికారులు పేర్కొన్నారు. ప్ర‌మాదం స‌మ‌యంలో హెలికాప్ట‌ర్ లో   14 మంది ప్ర‌యాణించిన‌ట్టు తెలుస్తున్న‌ది. అయితే ఈ  హెలికాప్ట‌ర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావ‌త్‌, ఆయ‌న భార్య మ‌ధులిక రావ‌త్‌, బ్రిగేడియ‌ర్ లిద్ద‌ర్‌, క‌ల్నల్ హ‌ర్జింద‌ర్ సింగ్‌,  పీఎస్‌వోలు గురుసేనక్ సింగ్‌, వివేక్‌కుమార్‌, జితేంద్ర‌కుమార్‌, సాయితేజ‌, స‌త్పాల్ ఉన్నారు. మొత్తం 14 మంది ప్ర‌యాణించిన హెలికాప్ట‌ర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 11 మృత‌దేహాలు ల‌భ్య‌మ‌య్యాయి.  కేంద్ర ప్ర‌భుత్వం అధికారిక ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. బిపిన్ రావ‌త్‌,ఆయ‌న భార్య మ‌ధులిక‌లు గ‌ల్లంత‌య్యారు వారి ఆచూకి తెలియాల్సి ఉంది. న‌లుగురు అక్క‌డికక్క‌డే మృతి చెంద‌గా.. ముగ్గురు ఆసుప‌త్రికి త‌ర‌లించిన త‌రువాత మృతి చెందారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: