త‌మిళ‌నాడు రాష్ట్రంలోని ఊటీ స‌మీపంలో కూనూరు నీల‌గిరి కొండ‌ల్లో ఆర్మీ హెలికాప్ట‌ర్ కూలింది. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టికే 13 మంది మృత్యువాత ప‌డ్డారు. సూలూరు ఆర్మీ క్యాంపు బేస్ నుంచి బ‌య‌లు దేరి వెల్లింగ్ట‌న్ వ‌ద్ద‌కు చేరుకునేందుకు వెళ్లింది. ఇవాళ మ‌ధ్యాహ్నం వెల్లింగ్ట‌న్‌లో బిపిన్ రావ‌త్‌ స్పీచ్ ఉండ‌డంతో ఆయ‌న హెలికాప్ట‌ర్ లో బ‌య‌లుదేరారు. ఆయ‌న‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి మ‌ధులిక‌, ఇత‌ర ఆర్మీ అధికారులు మొత్తం 14 మంది హెలికాప్ట‌ర్‌లో ప్ర‌యాణించారు.

ఉద‌యం 11.47 నిమిషాల‌కు సూలూరు నుంచి బ‌య‌లు దేరి.. మ‌ధ్యాహ్నం 12.27 నిమిషాల‌కు హెలికాప్ట‌ర్ కూనూరు దాటి దాదాపు 8 కీ.మీ. దూరం ప్ర‌యాణించిన త‌రువాత ఫారెస్ట్ ఏరియాలో చెట్ల మ‌ధ్య‌నే ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ది. బ్లాక్ బాక్స్ ఓపెన్ చేసిన త‌రువాతనే ప్ర‌మాదానికి సంబంధించిన‌ పూర్తి వివ‌రాలు తెలియ‌నున్నాయి. అయితే ఈ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంపై ఆర్మీచీఫ్ ర‌క్ష‌ణ శాఖ మంత్రికి వివ‌రించారు. ర‌క్ష‌ణ శాఖ మంత్రి ప్ర‌ధానికి చెప్పి అత్య‌వ‌స‌ర క్యాబినెట్ స‌మావేశం నిర్వ‌హించారు. అది ముగిసిన త‌రువాత వెంట‌నే ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి బిపిన్ రావ‌త్ నివాసానికి చేరుకున్నారు. ఆ త‌రువాత రేపు పార్ల‌మెంట్‌లో ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు ర‌క్ష‌ణ‌మంత్రి. ఈ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం గురించి తెలుసుకున్న‌ రాష్ట్రప‌తి త‌న ప‌ర్య‌ట‌న‌ను వ‌దులుకొని ఢిల్లీకి చేరుకున్నారు. బిపిన్ రావ‌త్‌కు  తీవ్ర గాయాలు కావ‌డంతో చికిత్స‌ను అందిస్తున్నారు. వివ‌రాల‌ను ఆర్మీ అధికారులు గోప్యంగా ఉంచారు.




మరింత సమాచారం తెలుసుకోండి: