త‌మిళ‌నాడు రాష్ట్రంలో కూనూరు వ‌ద్ద జ‌రిగిన హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో ఇప్ప‌టికే 13 మంది మృతి చెందార‌ని అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే బిపిన్ రావ‌త్ ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉంద‌ని తెలుస్తుంది. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని మాత్రం ర‌హ‌స్యంగా ఉంచుతున్నారు. అత్య‌వ‌స‌ర చికిత్స ప్ర‌స్తుతం అందిస్తున్నారు. ఒల్లంతా కాలిన గాయాలు కావ‌డంతో ఘ‌ట‌న స్థ‌లం నుంచి విల్లింగ్ట‌న్ బేస్ వ‌ద్ద చికిత్స అందిస్తున్నారు. 90 శాతం గాయాల‌తో బిపిన్ రావ‌త్ చికిత్స పొందుతున్నారు.

అయితే ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంపై  ఓ ప్ర‌త్య‌క్ష సాక్షి మాట్లాడారు. నేను ఇంట్లో ప‌ని చేసుకుంటూ ఉన్నాను. ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా భారీ శ‌బ్దం వినిపించ‌డంతో ఏమి జ‌రిగిందోన‌ని కంగారుప‌డి బ‌య‌టికి వ‌చ్చాను. బ‌య‌ట‌కొచ్చి చూసే స‌రికి హెలికాప్ట‌ర్ చెట్ల‌ను తాకుతూ కూలిపోయిన‌ది. నేను చూస్తుండ‌గానే ఇద్ద‌రు వ్య‌క్తులు మంట‌లంటుకొని హెలికాప్ట‌ర్ నుంచి బ‌య‌టికొచ్చి కుప్ప కూలారు. ద‌గ్గ‌రికి వెళ్దామ‌నుకుంటే.. మంట‌లు, పొగ ఉండ‌డంతో భ‌య‌ప‌డి అక్క‌డికి వెళ్ల‌లేక పోయాను అని చెప్పాడు ప్ర‌త్య‌క్షసాక్షి. హెలికాప్ట‌ర్  త‌క్కువ ఎత్తు నుంచి ప్ర‌యాణించి చెట్ల‌కు ఢీ కొన‌డంతోనే ఈ ప్ర‌మాదం సంభ‌వించిన‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: