కమ్యూనిస్టులకు  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఝలక్ ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో గత రెండు రోజులుగా సి.పి.ఎం పార్టీ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహా సభల్లో పలు తీర్మానాలను అమోదించారు. భవిష్యత్ కార్యాచరణ ను కూడా రూపొందించారు. ఈ సభలకు సీపిఎం జాతీయ నేతలు సీతారాం ఏచూరి,బృందాకారత్, బివిరాఘవులు  తోపాటు పలువురు పోలిట్ బ్యూరో సభ్యులు పాల్గోన్నారు. ఆ పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు సుబ్బారావు తమ పార్టీ ఆమోదించిన తీర్మానాలకు మీడియాకు వివరాలను వెల్లడించారు. ఆ తీర్మానాలలో ప్రముఖమైనది సహకార డెయిరీ పరిధిలోని పాలకేంద్రాల నుంచి క్షీరాన్ని సేకరించే బాధ్యత అమూల్ సంస్థకు ఇవ్వవద్దన్నది వారి ప్రధాన డిమాండ్.
కాగా సిపిఎం నేతలుఈ డిమాండ్ చేసి కొద్ది గంటలైనా గడవక ముందే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం తాడేపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కృష్ణా జిల్లాలో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమం పేరు జగనన్న పాలవెల్లువ. వాస్తవానికి ఈ కార్యక్రమం ఆంధ్ర ప్రదేశ్ లో ఎప్పుడో ఆరంభమైంది. అయితే దీనిని దశల వారీగా వివిధ జిల్లాలకు విస్తరిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో నడుస్తున్న సహకార డైరీలకు ఆర్థిక పరిపుష్టి కలిగించేందుకు ఈ కార్యక్రమ రూప కల్పన చేసినట్లు ప్రభుత్వం పేర్కోంటోంది. గత ఏడాది నవంబర్ లోనే ఈ పథకం ఆరంభమైంది. నాడు కడప, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, గోదావరి జిల్లాలో ఆరంభం కాగా, తాజాగా కృష్ణా జిల్లాలో ప్రారంభమైంది. త్వరలో విశాఖపట్నం, అనంతపురం జిల్లాలలో ఈ కార్యక్రమం ఆరంభమవుతుందని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: