నూత‌న సంవ‌త్స‌రం రోజునే జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభవించిన‌ది.  జార్ఖండ్‌లోని ఫ‌లాజ్ జిల్లాలోని హ‌రిహ‌ర్‌గంజ్‌లో వ్య‌వ‌సాయ కూలీల‌తో వెళ్లుతున్న వ్యాన్‌ను ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా ఎదురుగా వ‌స్తున్న ట్ర‌క్కు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న ప‌లాజు జిల్లాలోని హ‌రిహ‌ర్ గంజ్ వ‌ద్ద జ‌రిగింది. ముగ్గురు కూలీలు అక్క‌డిక్క‌డే మృతి చెందగా.. . మ‌రొక‌18 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

గాయాల‌పాలైన వారినీ ఘ‌ట‌న‌స్థ‌లానికి స‌మీపంలో ఉన్న‌టువంటి హ‌రిహ‌ర‌గంజ్ సీహెచ్‌సీకీ త‌ర‌లించారు.  బ‌సంతి(17), అర్ప‌ణ‌(14), నీలం (16) ల ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో ఔరంగాబాద్‌లోని స‌ద‌ర్ ఆసుపత్రికి త‌ర‌లించ‌గా.. చికిత్స పొందుతూ ముగ్గురు మృత్యువాత‌ప‌డ్డారు. దీంతో మొత్తం ఆరుగురు మృతి చెందడంతో పాటు.. 18 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిలో మరొక ఆరుగురి ప‌రిస్థితి విష‌మంగానే ఉన్న‌ట్టు స‌మాచారం. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ద‌ని.. ఈఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: