త‌మిళ‌నాడు రాష్ట్రంలో భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకున‌న‌ది. శివ‌కాశీ బాణ‌సంచా త‌యారీ కేంద్ర‌ములో మ‌రొక‌సారి పేలుడు సంభ‌వించిన‌ది. ట‌పాసుల కేంద్రంలో పెద్ద శ‌బ్దంతో పేలుడు జ‌రిగిన‌ది. పేలుడు ధాటికీ భ‌వ‌నం నేల‌మ‌ట్ట‌మైన‌ది. బాణ‌సంచా త‌యారు చేస్తున్న సిబ్బంది న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు వ‌దిలారు. మ‌రొక ఇద్ద‌రి ప‌రిస్థితి మాత్రం విషమంగా ఉన్న‌ట్టు స‌మాచారం.

ప్ర‌మాద స‌మాచారం తెలుసుకున్న అధికారులు, వెంట‌నే ఘ‌ట‌న స్థ‌లానికీ చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. గాయ‌ప‌డిన వారినీ ఆసుప‌త్రికీ త‌ర‌లించారు.క్రాక‌ర్స్ త‌యారీలో ప్ర‌సిద్ధిచెందిన శివ‌కాశీలో త‌రుచూ ప్ర‌మాదాలు జ‌రుగుతూనే ఉంటాయి.ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అయినా స‌రే, టపాసుల త‌యారీ కేంద్రాల‌లో ప్ర‌మాదాల నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు.

విరుదున‌గ‌ర్ జిల్లా శివ‌కాశీ స‌మీపంలోని ఎం.పుదుప‌ట్టి స‌మీపం ఉన్న‌టువంటి మెట్టుప‌ట్టి గ్రామంలో మురుగ‌న్ ప‌టాకుల ఫ్యాక్ట‌రీ నడిపిస్తున్నాడు. శ‌నివారం నూత‌న సంవ‌త్స‌రం రోజు ఎప్ప‌టి మారిదిగానే బాణ‌సంచా ఫ్యాక్ట‌రీలో కార్మికులు విధులు నిర్వ‌హిస్తుండ‌గా.. ఒక్క‌సారిగా పేలుడు సంభ‌వించింది. పేలుడు ప‌దార్థాల త‌యారీ స‌మ‌యంలో రాపిడి కార‌ణంగా పేలుడు సంభ‌వించిన‌ట్టు స్థానికులు పేర్కొంటున్నారు.

ఈ పేలుడు ధాటికీ ముగ్గురు కార్మికులు అక్క‌డిక‌క్క‌డే దగ్దం  అయ్యారు. తీవ్ర‌గాయాల‌పాలైన ముగ్గురు కూలీల‌ను శివ‌కాశీ ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వారిలో ఒక‌రు మృతి చెందారు. పేలుడు జ‌రిగిన ఫ్యాక్ట‌రీలో 10కి పైగా గ‌దులున్నాయి. పేలుడు దాటికి భ‌వ‌నం పూర్తిగా నేల‌మ‌ట్ట‌మైంది. శివ‌కాశి బాణ‌సంచా క‌ర్మాగారంలో పేలుడు సంభ‌వించిన ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: