భారత ప్రధాన మంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోడీ వాహనం ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుంది. అవును ఇది నిజం. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా అరగంట పైనే..ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు. దేశ రాజధాని నగరం ఢిల్లీకి సరిహద్దులో ఉన్న రాష్ట్రంలో. అక్కడి రాష్ట్ర పాలకులు కాంగ్రెస్ నేతలు..అసలు ఎందుకిలా జరిగింది?
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భఠిండాకు వెళ్లారు. అక్కడ నుంచి ఆయన హెలికాప్టర్ లో హుసేన్సీ వాలా లోని అమర వీరుల స్మారక చిహ్నం వద్దకు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించాల్సి ఉంది. అయితదే వాతావరణం చాప్టర్ ప్రయాణానికి అనుకూలించ లేదు. దీంతో కేంద్ర హోం శాఖ వర్గాల సూచన మేరకు ప్రదాన మంత్రి రోడ్డు మార్గం గుండా ప్రయాణించేందుకు అంగీకరించారు. దీంతో కేంద్ర హోం శాఖ ప్రధాని పర్యటన వివరాలను రాష్ట్ర పోలీసులకు, హోం శాఖకు తెలియపరిచింది.   పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఓకే చెప్పిన తరువాతనే ప్రధాన మంత్రి క్యాన్వాయ్ బయలు దేరినట్లు కేంద్ర హోం శాఖ పేర్కోంటోంది. కారణం ఏదైనా ప్రధాన మంత్రి వాహహన శ్రేణి ఓ ప్లైఓవర్ దాటే సమయంలో నిరసన కారులు రహదారిని నిర్భందించారు. దీంతో ప్రధాన మంత్రి వాహణ శ్రేణి బ్రిడ్జి పైనే దాదాపు అరగంట పాటు నిలిచి పోయింది. భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. ప్రధాన మంత్రి స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించిన అనంతరం ఆయన తన ఫిరోజ్ పూర్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం అయింది. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: