ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భార్య, మరికొందరు రాజకీయ నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై మహారాష్ట్ర బీజేపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జితేన్ గజారియాపై పూణె పోలీసులు కేసు నమోదు చేసినట్టు ఓ అధికారి శుక్రవారం తెలిపారు.గజారియాను అరెస్ట్ చేసేందుకు పూణె సైబర్ సెల్ బృందం గురువారం ముంబైకి వెళ్లిందని, అయితే అతను అతని నివాసంలో కనిపించలేదని ఆయన చెప్పారు. ఆ త‌రువాత అరెస్ట్ చేసిన‌ట్టు స‌మాచారం.మేము అతని సోదరుడికి నోటీసు కాపీని జారీ చేసాం. దానిపై స్పందించాలని కోరామ‌ని  పూణే సైబర్ సెల్ పోలీసు ఇన్స్పెక్టర్ డి హకే చెప్పారు.ఠాక్రే నేతృత్వంలోని శివసేన కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు గజారియాపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

సీఎం భార్య  రష్మీ థాకరే, ఎన్‌సీపీ నేతలు శరద్ పవార్, అజిత్ పవార్, (కాంగ్రెస్ అధ్యక్షురాలు) సోనియా గాంధీలపై సోషల్ మీడియా వేదికపై అభ్యంతరకర, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదు చేయబడింది. నాయకులు, రెండు గ్రూపుల మధ్య విద్వేషాలు సృష్టించే లక్ష్యంతో కొన్ని పోస్టులు పెడుతున్నారు’’ అని హేక్ అన్నారు. రాష్ట్ర మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌లు భాగస్వామ్యపక్షాలు.  ముంబై పోలీసులు  గురువారం గజారియాను 'అభ్యంతరకరమైన' ట్వీట్లపై దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు.
 



మరింత సమాచారం తెలుసుకోండి: