తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు కొద్ది సేపటి క్రితం మచ్చింతల్ చేరుకున్నారు. అక్కడ ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజియ్యర్ స్వామీజీతో ఆయన సమావేశం అయ్యారు.  కరోనా ముంచుకు వస్తున్న వేళ ... ఉభయ కమ్యూనిస్టులతో సమావేశం ముగిసిన మరుసటి రోజే చినజియ్యర్ స్వామితో కెసిఅర్ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంతకీ వీరిద్దరి భేటీకి కారణం ఏమిటి ?
అవిభక్త ఆంద్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం వేరు పడ్డాక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయం తరహాలో తెలంగాణలోనూ ఓ ఆధ్యాత్మిక నగరి ఉండాలని సంకల్పించారు.  ఇందుకోసం ఆయన పలువురు హిందూ మత పెద్ద లతో సమావేశం ఆయ్యారు. వారి సూచనల మేరకు యాదగిరి గుట్ట దేవాలయాన్ని పుర్తిస్తాయిలో ఆధునీకరించాలని తలంచారు. యాదగిరి గట్ట పేరును యాదాద్రి మార్చారు.ఆలయాన్ని కోట్లాది రూపాయలతో పునర్ నిర్మించారు. ప్రస్తుతం యాదాద్రి పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి. ఇక మిగిలింది ఆలయ మహాకుంభాభిషేకం, పునః ప్రతిష్ఠ. ఈ మహా క్రతువు కు మార్చి 28 న నిర్వహించనున్నట్లు కెసిఆర్ గతంలోనే ప్రకటించారు. ఈ కార్యక్రమానికి దాదాపు ఏడెనిమిది రోజుల ముందే యాజ్ఞీక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. ఈ అంశాలను చర్చించేందుకు  తెలంగాణ ముఖ్యమంత్రి మచ్చింతల్ వేళ్లినట్లు సమాచారం. ఆయన ఇదే సందర్భంలో రామానుజాచార్యుల విగ్రాహావిష్కరణ, ఆలయ మహాకుంభ సంప్రాక్షణ గురించి కూడా చర్చిస్తారని అధికార వర్గాల సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr