ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలుకు ఒక ప్రత్యేకత ఉంది.  భారత్ లో తొలి భాషా ప్రయోక్త రాష్ట్రం గా తెలుగు ప్రజలు రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నప్పుడు తొలి రాజధని కర్నూలు. ఇప్పటికీ ఈ జిల్లాలో చాలా విషయాలలోఅగ్ర స్థానంలో ఉంది. అలాంటి  కర్నూలులోని  మోడికల్ కళాశాలలో కలకలం రేగింది ? కారణం ఏమిటో తేలుసా ?
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 తాజా వేరియంట్ ఓమిక్రాన్ కర్నాలు కళాశాలలో పంజా విసిరింది. దాదాపు యాభై మంది కి కరోనా సోకినట్లు సమచారం. ఈ విషయం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. మొదటి సంవత్సరం ఎం.బి.బి.ఎస్ చదువుతున్నపదకుండు మంది విద్యార్థులకు, మరో నలుగురు హౌస్ సర్జన్ లకు కరోనా సోకిందని తెలిసింది. వీరంతా కూడా జిజిహెచ్ పెయింగ్ బ్లాక్ లో ప్రత్యేకంగా చికిత్స పొందుతున్నట్లు అసుపత్రి వర్గాల సమాచారం. మిగిలిన విద్యార్థుల పరీక్షల రిపోర్టులు రావలసి ఉన్నందున వారినందరినీ ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంచారు. సమాచారం అందుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య కళాశాల ఆధ్యాపక సిబ్బందితో సమావేశ మయ్యారు. పరిస్థిని సమీక్షించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా  కర్నూలు ఆసుపత్రి వర్గాలతో ఫోన్ లో మాట్లాడినట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: