తెలుగు రాష్ట్రాల‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య మ‌ళ్లీ రోజు రోజుకూ  విప‌రీతంగా పెరిగిపోతుంది. కొన్నిసార్లు కాస్త త‌గ్గిన‌ట్టే త‌గ్గినా.. మ‌ర‌ల ఉదృతి కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికే చాలా మంది ప్ర‌ముఖుల‌ను క‌రోనా ట‌చ్ చేసింది. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు కొవిడ్ బారిన‌ప‌డ్డారు. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని క‌రోనా బారిన ప‌డ్డారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని గ‌చ్చిబౌలిఏఐజీ ఆసుప‌త్రిలో చేరారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్టు స‌మాచారం.


మ‌రొక‌వైపు టీడీపీ నేత వంగ‌వీటి రాధాకృష్ణ‌కు కూడా క‌రోనా పాజిటివ్‌గా తేలింది. ఇత‌ను కూడా హైద‌రాబాద్‌లోని ఏఐజీ ఆసుప్ర‌తిలో చేరి చికిత్స పొందుతున్నారు. క‌రోనా ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగానే ఉన్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌లే వంగ‌వీటి రాధా ఏపీలో హాట్ టాఫిక్ అయ్యారు. వంగ‌వీటి రంగ వ‌ర్థంతి సభ‌లో రాధా చేసిన వ్యాఖ్య‌లు పెను సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. త‌న‌ను హ‌త్య చేయ‌డానికి రెక్కి నిర్వ‌హించారు అని బాంబు పేల్చారు రాధా. ఏపీ ప్ర‌భుత్వం ఆయ‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డం, ఆయ‌న తిర‌స్క‌రించ‌డం వంటివి కూడా చోటు చేసుకున్నాయి. వంగ‌వీటి రాధా క‌రోనా నుంచి పూర్తిగా కోలుకొని తిరిగిరావాల‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: