ఐఐటి ని వదలని కరోనా... ఎక్కడో తెలుసా ?
కోవిడ్-19 నూతన వేరియంట్ ఓమిక్రాన్ వారినీ, వీరిని అని వదలకుండా అందరినీ ఆవరిస్తోంది. నిన్న మొన్న పశ్చిమ బంగాల్ లో వైద్యకళాశల వైద్యులకు సోకింది.  ఈ వారంలో గాంధీ ఆసుపత్రి వైద్యులకు సోకింది. పెద్ద సమూహంగా సోకిందనడానికి ఇవి చిన్న ఉదాహరణలు. ఇక సెలిబ్రటీలు, మంత్రుల సంగతి చెప్పనవసరం లేదు. తాజాగా భారత్ లోని ఐఐటి కళాశాల విద్యార్థులకు సోకింది. ఎక్కడంటే?
భారత్ ఐఐటి లంటే అదో క్రేజ్. అక్కడ విద్యాభోధన,  లభించే సదుపాయాలు,  నడవడిక, ముఖ్యంగా కోవిడ్-19 సమయంలో తీసుకున్న చర్యలు, జరుగుతున్న పరిశోధనలపై యావత్ ప్రపంచం దృష్టి సారిస్తుంది. దీంతో ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి ఐఐటి కళాశాలలో చదవాలని అభిలాషిస్తారు. తల్లితండ్రులు కూడ తమ పిల్లలు ఐఐటి కళాశాలలో చదవాలని ఆకాంక్షిస్తారు. అలాంటి ఐఐటి కళాశాలపై కరోనా పడప విప్పింది  ఐఐటి హైదరాబాద్  కళాశాలలో ఏకంగా నూట యాభై మందికి పైగా కరోనా బారిన పడినట్లు సమాచారం. అధికారులు మాత్రం 119 మందికి కరోనా బారిన పడ్డారని ప్రకటించారు. వారి నందరినీ హాస్టల్ లోనే ప్రత్యేక గదుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

iit