ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఆంధ్ర ప్రదేశ్ సీఎం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మనవైన.. అచ్చ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు, సొంత గ్రామాలమీద మమకారానికి, రైతులకు  సంక్రాంతి ప్రతీక అని ఆయన కొనియాడారు. వ్యవసాయానికి మనమంతా ఇచ్చే గౌరవానికి, తెలుగువారి కంటూ ప్రత్యేకమైన కళలకు  సంక్రాంతి పండుగ ప్రతీక అని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు.

 
భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని సీఎం జగన్ తెలిపారు.  భోగి.. సంక్రాంతి.. కనుమ పండుగలను ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని  సీఎం జగన్ ఆకాంక్షించారు.


ఇప్పటికే తెలుగు లోగిళ్లకు సంక్రాంతి శోభ వచ్చేసింది. రేపు ఉదయాన్నే భోగి మంటలు వేసి.. అదే రోజు పిల్లలకు భోగి పళ్లుపోసి పండుగను ఆరంభించనున్నారు. ఇక ఆ తర్వాత రెండు రోజులు సంక్రాంతి సంబరాలతో పల్లెలు కళకళలాడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: