ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఫిట్‌మెంట్‌ తో సంతృప్తి చెందని ఉద్యోగ సంఘాలు మరోసారి పోరుకు సిద్దం అవుతున్నాయి. రేపు FAPTO అద్వర్యంలో 12 సంఘాల ఉపాద్యాయ ఐక్య వేదిక కీలక సమావేశం  ఏర్పాటు చేసింది. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడలోని యూటీఫ్ రాష్ట్ర కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్టు ఆ సంఘాలు తెలిపాయి.


11 వ PRC ఫిట్మెంట్ 23% ప్రభుత్వం ప్రకటించడాన్ని ఈ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తూ సమావేశం ఏర్పాటు చేశాయి. ఉపాధ్యాయ,ఉద్యోగ, పెన్షనర్స్  సంఘాలతో ఈ రౌండ్ టేబుల్  సమావేశం ఏర్పాటు చేశాయి. రౌండ్ టేబుల్  అనంతరం ఉద్యమ కార్యాచరణను ఉద్యోగ సంఘాలు ప్రకటించనున్నాయి.


ఇప్పటికే కొన్ని సంఘాలు ఈ పీఆర్సీని ఒప్పుకునేది లేదని తేల్చి చెబుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ మాకు ఓకే కాదని ఇప్పటికే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సీఎస్ కు లేఖ కూడా  రాసింది. సచివాలయంలో సీఎస్ ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని కూడా అందించింది. ఈ నేపథ్యంలో ఈ రౌండ్‌ టేబుల్ సమావేశం కీలకంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: