కరోనా దృష్ట్యా వైకుంఠ ఏకాదశి రోజు భక్తులకు కొన్ని ఆలయాల్లోకి అనుమతి లేదని అధికారులు ప్రకటించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ నిబంధనలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ గుళ్లకు వచ్చి నిరాశగా వెనుదిరగవద్దని సూచిస్తున్నారు. సాధారణంగా వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు గుళ్లకు పోటెత్తడం సహజం. అందుకే అధికారులు ఈ సమాచారం అందిస్తున్నారు.

ఆ ఆలయాలు ఏవంటే.. గుడిమల్కాపూర్ వేంటేశ్వరస్వామి ఆలయం, సికింద్రాబాద్ పెరుమాళ్ వేంకటేశ్వర స్వామి ఆలయం, బంజారాహిల్ రోడ్ నంబర్ 1 లోని శ్రీ లక్ష్మీ వేంటేశ్వరస్వామి ఆలయం, చిక్కడ పల్లి వేంటేశ్వరస్వామి ఆలయం, బిల్లా మందిర్, హిమాయత్ నగర్ టీటీడీ ఆలయం, జూబ్లిహిల్స్  టీటీడీ ఆలయం, బాలాపూర్ జిల్లేలగూడలోని వేంటేశ్వరస్వామి ఆలయాల్లోకి భక్తులను దర్శనానికి అనుమతించరు. అయితే... వైకుంఠ ఏకాదశి పూజలు ఆయా ఆలయాల్లో యథావిథిగా జరుగుతాయి. భక్తులు ఈ విషయం గమనించగలరు.


మరింత సమాచారం తెలుసుకోండి: